Ameerpet ఐసీఐసీఐ ఏటీఎంలో చోరీకి యత్నం

ABN , First Publish Date - 2022-01-28T17:07:03+05:30 IST

అమీర్‌పేట బొంగుల బస్తీలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏటీఎంలో ఓ ఆగంతుకుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎం ప్రధాన ద్వారం, ఏటీఎం కీబోర్డును స్వల్పంగా

Ameerpet ఐసీఐసీఐ ఏటీఎంలో చోరీకి యత్నం

సీసీ కెమెరా మూసి ప్రధాన ద్వారం, కీబోర్డు ధ్వంసం  

నగదు వ్యాలెట్‌ తెరిచే ప్రయత్నం 

అలారం మోగడంతో పరారీ   


హైదరాబాద్/పంజాగుట్ట: అమీర్‌పేట బొంగుల బస్తీలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏటీఎంలో ఓ ఆగంతుకుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎం ప్రధాన ద్వారం, ఏటీఎం కీబోర్డును స్వల్పంగా ధ్వంసం చేశాడు. నగదు వ్యాలెట్‌ తెరిచే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో ఆగంతుకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంగుల బస్తీలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏటీఎం ఉంది. ఓ ఆగంతుకుడు అందులోకి ప్రవేశించి తాను కనిపించకుండా అక్కడి సీసీ కెమెరాకు అడ్డంగా వస్త్రాన్ని చుట్టాడు.


ఈ విషయాన్ని ముంబాయిలో సీసీ కెమెరాలను మానిటరింగ్‌ చేసే సిబ్బంది తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో గుర్తించారు. దీంతో ఏటీఎంలో దొంగతనం జరుగుతోందని అనుమానించి అలారం బటన్‌ నొక్కారు. వెంటనే ఇక్కడి ఏటీఎంలోని అలారం మోగడంతో ఆగంతుకుడు పారిపోయాడు. వెంటనే ఏటీఎంలు పరిశీలించే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-28T17:07:03+05:30 IST