చెన్నైలో అంబులెన్స్‌ కారు సౌకర్యం ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-14T13:09:14+05:30 IST

గేట్రర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలోని 15 మండలాల్లో ఆక్సిజన్‌ సౌకర్యం లేని అంబులెన్స్‌ కారు సేవలు అందుబాటులోకి వచ్చాయి...

చెన్నైలో అంబులెన్స్‌ కారు సౌకర్యం ప్రారంభం

చెన్నై/పెరంబూర్‌: గేట్రర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలోని 15 మండలాల్లో ఆక్సిజన్‌ సౌకర్యం లేని  అంబులెన్స్‌ కారు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అంబులెన్స్‌లను మంత్రి కేఎన్‌ నెహ్రూ జెండా ఊపి ప్రారంభించారు. ఈ విషయమై జీసీసీ కమిషనర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ బేదీ మీడియాతో మాట్లాడుతూ,  కరోనా బాధితులను ఆస్పత్రులకు తీసుకెళుతున్న ‘108’ అంబులెన్స్‌లతో పాటు ఈ కార్లు అందుబాటులో వుంటాయన్నారు. అంబులెన్స్‌ రాక ఆలస్యమైన ప్రాంతాలకు ఈ కార్లు వెళ్లి బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్తాయన్నారు. ఈ కారు అంబులెన్స్‌ సేవలు పొందేందుకు మండలాల వారీగా సెల్‌ఫోన్‌ నెంబర్లు త్వరలో విడుదల చేయనున్నట్టు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2021-05-14T13:09:14+05:30 IST