Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌ సేవలు ఎనలేనివి

65వ వర్ధంతి కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌

కాకినాడ సిటీ, భానుగుడి (కాకినాడ), డిసెంబరు 6: ప్రపంచ మేథావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ కొనియాడారు. సోమవారం అంబేడ్కర్‌ 65వ వర్ధంతి సందర్భంగా ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, కలెక్టర్‌ హరికిరణ్‌, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అంబేడ్కర్‌ సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు కీర్తి చేకూరి, ఎ.భార్గవ్‌తేజ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మోనిటరింగ్‌ కమిటీ సభ్యుడు అయితాబత్తుల రామే శ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. Advertisement
Advertisement