Ambedkar Open Universityలో డిగ్రీ, పీజీ

ABN , First Publish Date - 2022-07-04T21:42:31+05:30 IST

హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(Ambedkar Open University) (బీఆర్‌ఏఓయూ) - గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి

Ambedkar Open Universityలో డిగ్రీ, పీజీ

హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(Ambedkar Open University) (బీఆర్‌ఏఓయూ) - గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా అడ్మిషన్స్‌ పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. 


డిగ్రీ ప్రోగ్రామ్‌లు: బీఏ, బీకాం, బీఎస్సీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఇంగ్లీష్‌ లేదా తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. బీఏ, బీఎస్సీ ప్రోగ్రామ్‌లకు ఉర్దూ మాధ్యమం కూడా అందుబాటులో ఉంది.

అర్హత: బీఏ, బీకాం ప్రోగ్రామ్‌లకు ఏదేని గ్రూప్‌తో; బీఎస్సీలో ప్రవేశానికి సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌; ఏపీ/ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (బీఎల్‌ఐఎస్సీ) కోర్సు వ్యవధి ఏడాది. దీనికి తెలుగు లేదా ఇంగ్లీష్‌ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రికార్డ్‌ అసిస్టెంట్‌గా ఏడాది అనుభవం లేదా లైబ్రరీ సైన్స్‌ విభాగంలో డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. లా/ ఇంజనీరింగ్‌ / ఫార్మసీ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులే.

పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ప్రోగ్రాములు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. 

ఎంఏ స్పెషలైజేషన్‌లు: జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, ఉర్దూ.

ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు: మేథమెటిక్స్‌, అప్లయిడ్‌ మేథమెటిక్స్‌, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, జువాలజీ.

  • ఎంబీఏ, ఎంఏ(జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌/ ఇంగ్లీష్‌), ఎంకాం, ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లను ఇంగ్లీష్‌ మీడియంలో చదవాల్సి ఉంటుంది. ఎంఏ (ఎకనామిక్స్‌/ హిస్టరీ/ పొలిటికల్‌ అడ్మినిస్ట్రేషన్‌/ సోషియాలజీ) ప్రోగ్రామ్‌లు తెలుగు మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. 

అర్హత: ఎంబీఏలో ప్రవేశానికి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టీఎస్‌/ ఏపీ ఐసెట్‌ 2022 అర్హత పొంది ఉండాలి. ఎంఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. లాంగ్వేజెస్‌(ఇంగ్లీష్‌ మినహా)లో ఎంఏ ప్రోగ్రామ్‌నకు డిగ్రీ స్థాయిలో సంబంధిత లాంగ్వేజ్‌ని సెకండ్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. ఎంకాంలో ప్రవేశానికి బీకాం/ బీబీఏ/ బీబీఎం/ బీఏ(కామర్స్‌) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీలో ప్రవేశానికి సంబంధిత సబ్జెక్ట్‌లతో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. మేథమెటిక్స్‌, అప్లయిడ్‌ మేథమెటిక్స్‌ స్పెషలైజేషన్‌లకు బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. సైకాలజీకి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు; ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌కు ఏదేని సైన్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.

  • మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (ఎంఎల్‌ఐఎస్సీ) ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇది ఇంగ్లీష్‌ మాధ్యమంలో మాత్రమే అందుబాటులో ఉంది. కనీసం 40 శాతం మార్కులతో బీఎల్‌ఐఎస్సీ పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు.

పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది.   

స్పెషలైజేషన్‌లు: మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఫైనాన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు, హ్యూమన్‌ రైట్స్‌, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం, ఉమెన్‌ స్టడీస్‌. 

  • రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు స్పెషలైజేషన్‌కు మాత్రం ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు మాస్‌ మీడియాలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు: ప్రోగ్రామ్‌ వ్యవధి ఆర్నెల్లు. విభాగాన్ని అనుసరించి పదోతరగతి/ ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు.

విభాగాలు: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌, ఎన్‌జీఓస్‌ మేనేజ్‌మెంట్‌, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: www.braou.ac.in

Updated Date - 2022-07-04T21:42:31+05:30 IST