నేడు ఒంగోలులో అంబేడ్కర్ భవనం ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-28T06:51:08+05:30 IST
జిల్లా కేంద్రం ఒంగోలు లో పునర్నిర్మాణమైన అంబేడ్కర్ భవనాన్ని శుక్రవా రం ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న భవనాన్ని రూ.3కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ పనులను ఏడా దిక్రితం ప్రారంభించి ఇప్పటికి పూర్తి చేయగా గతం లో ఉన్న పాత భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.
హాజరుకానున్న మంత్రులు విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు నగరం, మే 27: జిల్లా కేంద్రం ఒంగోలు లో పునర్నిర్మాణమైన అంబేడ్కర్ భవనాన్ని శుక్రవా రం ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న భవనాన్ని రూ.3కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ పనులను ఏడా దిక్రితం ప్రారంభించి ఇప్పటికి పూర్తి చేయగా గతం లో ఉన్న పాత భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఈనేపథ్యంలో అంబేడ్కర్ భవనాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి విశ్వరూప్, జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
నేడు ఎన్ఎస్ఎఫ్డీసీ యూనిట్ల పంపిణీ
రెండేళ్ల క్రితం మంజూరు చేసి 81 యూనిట్లను లబ్ధిదారులకు మంత్రుల చేతులు మీదుగా పంపిణీ చేయనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ యూని ట్లను అందించనున్నారు. గత ప్రభుత్వ హాయాంలో వందలాది మందికి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్ఎ స్ఎఫ్డీసీ యూనిట్లను మంజూరు చేశారు. ఇందులో 81 మందికి యూనిట్లను ఇంత వరకు అందించలేదు. మంజూరు చేసి పెండింగ్లో ఉన్న యూనిట్లను అం దించాలని గత కొంతకాలంగా లబ్ధిదారుల నుంచి వి జ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ యూ నిట్లను మంత్రుల చేతుల మీదుగా అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. లబ్ధి దారులకు అందించే వాటిలో మినీ డెయిరీలు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లు ఉన్నాయి. స్థానిక అంబే డ్కర్ భవనం వద్ద జరిగే కార్యక్రమంలో వాటిని అం దజేయనున్నారు.