కోచింగ్‌ బాటలో అమెజాన్‌

ABN , First Publish Date - 2021-01-16T05:43:36+05:30 IST

అమెజాన్‌ అంటే ఇప్పటివరకు ఈ కామర్స్‌ సంస్థగానే తెలుసు. ఇప్పుడుఈ సంస్థ భారతదేశంలో కొత్తగా ఇంజనీరింగ్‌ కోచింగ్‌ ఎంట్రెన్స్‌ రంగంలోకి ప్రవేశిస్తోంది. అవసరాలకు తగ్గట్టు మలిచిన కంటెంట్‌, ఆలిండియా స్థాయిలో మాక్‌ టెస్టులు, లైవ్‌ తరగతులు, పర్సనలైజ్డ్‌ పర్ఫార్మెన్స్‌ అనాల్సిస్‌తో ‘అమెజాన్‌ అకాడమీ’ పేరిట ఆన్‌లైన్‌ వేదిక సన్నద్ధమవుతోంది...

కోచింగ్‌ బాటలో అమెజాన్‌

అమెజాన్‌ అంటే ఇప్పటివరకు ఈ కామర్స్‌ సంస్థగానే తెలుసు. ఇప్పుడుఈ సంస్థ భారతదేశంలో కొత్తగా ఇంజనీరింగ్‌ కోచింగ్‌ ఎంట్రెన్స్‌ రంగంలోకి ప్రవేశిస్తోంది. అవసరాలకు తగ్గట్టు మలిచిన కంటెంట్‌, ఆలిండియా స్థాయిలో మాక్‌ టెస్టులు, లైవ్‌ తరగతులు, పర్సనలైజ్డ్‌ పర్ఫార్మెన్స్‌ అనాల్సిస్‌తో ‘అమెజాన్‌ అకాడమీ’ పేరిట ఆన్‌లైన్‌ వేదిక సన్నద్ధమవుతోంది. ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ ‘జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌’కు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఈ అకాడమీని అమెజాన్‌ ఆరంభించింది. టెస్ట్‌లో అడిగే మూడు సబ్జక్టులు అంటే ఫిజిక్స్‌, మేథ్స్‌, కెమిస్ట్రీకి సంబంధించి  లైవ్‌ లెక్చర్లు, కాంప్రహెన్సివ్‌ అసెస్‌మెంట్లకోసం ఏర్పాటు చేసింది. అకాడమీకి చెందిన బేటా వెర్షన్‌ ఇప్పుడు గ్లూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తోంది. ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌లకు మించి మెటీరియల్‌ను త్వరలో అందించబోతోంది. 


హింట్స్‌ సహా పదిహేను వేలకు మించి ప్రశ్నలు, ప్రాక్టీస్‌ కోసం స్టెప్‌ బై స్టెప్‌ సొల్యూషన్స్‌ను అందులో అందుబాటులో ఉంచింది. చాప్టర్లవారీగా, పార్ట్‌లుగా, ఫుల్‌గా టెస్ట్‌లు కూడా ఉన్నాయి. ఈ టెస్టులు రాసిన విద్యార్థులకు ఆలిండియా ర్యాంకులు ఇస్తుంది. తద్వారా అఖిల భారత స్థాయిలో తమ ర్యాంకు అలాగే బలాలు, బలహీనతలను విద్యార్థులు తెలుసుకోవచ్చు. మేజర్‌ కోచింగ్‌ సంస్థల సహకారంతో మాక్‌ టెస్టును నిర్వహిస్తుంది. స్కోర్‌ను విద్యార్థులకు ఇచ్చి తోడ్పడుతుంది. ఆ టెస్టులకు కొంత ఫీజు ఉంటుంది.  అయితే ఆ వివరాలను అమెజాన్‌ ఇంకా బైటపెట్టలేదు. జెఇఇ వంటి పోటీ పరీక్షల్లో వెల్లడయ్యేది సాపేక్ష స్కోరు. అందుకు అనుగుణంగా లైవ్‌ లెసన్స్‌, కాన్సెప్టుల నుంచి వివిధ టాపిక్స్‌ విషయంలో సందేహాల నివృత్తికి ఎక్స్‌పర్ట్‌ ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచుతోంది.


Updated Date - 2021-01-16T05:43:36+05:30 IST