గూగుల్‌నీ యాపిల్‌నీ దాటిపోతున్న అమెజాన్‌?

ABN , First Publish Date - 2020-02-14T00:39:17+05:30 IST

గూగుల్‌నీ యాపిల్‌నీ దాటిపోతున్న అమెజాన్‌?

గూగుల్‌నీ యాపిల్‌నీ దాటిపోతున్న అమెజాన్‌?

ప్రపంచ టెక్నో దిగ్గజాలు గూగుల్‌ యాపిల్‌ - ఎన్నో విషయాల్లో ఒకదాంతో ఒకటి పోటీ పడుతుంటాయి. అయితే ఇప్పుడు ఒక విషయంలో అమెజాన్‌ సంస్థ - ఇటు గూగుల్‌నీ అటు యాపిల్‌నీ కూడా అధిగమించి ముందుకి పోతోంది. అది ఏ విషయంలోనో తెలుసా? వాయిస్‌ అసిస్టెంట్స్‌ విషయంలో!


ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాయిస్‌ అసిస్టెంట్స్‌ ట్రెండ్ నడుస్తోంది. మాటవినగానే పనిచేసి పెట్టే ఈ పరికరాల్ని వాయిస్‌ అసిస్టెంట్స్‌ అని మాత్రమే కాదు, హోమ్‌ అసిస్టెంట్స్‌ అని కూడా అంటున్నారు. చెప్పీ చెప్పగానే కావలసిన మ్యూజిక్‌నీ, అడిగిన న్యూస్‌నీ ప్లే చేసే ఈ డివైజెస్‌ - హోమ్‌ యాక్సెసరీస్‌తో లింక్‌ అయి కూడా ఎన్నో రకాల పనులు చేయగలవు. వివిధ సామర్థ్యాల్ని కలిగి ఉండడంతో - ఈ హోమ్‌ అసిస్టెంట్లు ఈ మధ్య ఎంతో సౌకర్యవంతమైన పరికరాలుగా పేరు తెచ్చుకున్నాయి.


హోమ్‌ అసిస్టెంట్‌ పరికరాల వాడకానికి వివిధ సంస్థలు - తమ తమ ప్రత్యేక వాయిస్‌ టెక్నాలజీల్ని వాడుతున్నాయి. గూగుల్‌ అయితే గూగుల్‌ అసిస్టెంట్‌, యాపిల్‌ అయితే సిరి, అమెజాన్‌ అయితే అలెక్సా, మైక్రోసాఫ్ట్‌ అయితే కోర్టానా - అనే వాయిస్‌ అసిస్టెంట్లని వాడతాయన్నది తెలిసిందే! గూగుల్‌ అసిస్టెంట్‌ ఆధారంగా పనిచేసే హోమ్‌ అసిస్టెంట్ల మాటకి వస్తే - నెస్ట్‌ మిని, నెస్ట్‌ హబ్‌, నెస్ట్‌ మ్యాక్స్‌, అలాగే గూగుల్‌ హోమ్‌, హోమ్‌ మినీ, హోమ్‌ మ్యాక్స్ లాంటివి చాలా ఉన్నాయి. సిరి ఆధారంగా పనిచేసే హోమ్‌ పాడ్‌ లాంటి పరికరాల్ని యాపిల్‌ తయారుచేసింది. ఇక అమెజాన్‌ అయితే - అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ ఆధారంగా పనిచేసే ఎకోడాట్‌, ఎకో స్పాట్‌, ఎకో ప్లస్‌, ఎకో షో లాంటి ఎన్నో పరికరాల్ని తయారుచేసింది.


అయితే హోమ్‌ అసిస్టెంట్స్‌ అన్నిటిలోకీ ఇప్పుడు అమెజాన్‌ పరికరాలే టాప్‌ లో ఉన్నాయట. అమ్మకాలలో గానీ, వాయిస్‌ని గుర్తించే క్వాలిటీలోగానీ - అమెజాన్‌ పరికరాలు - గూగుల్‌, యాపిల్‌ పరికరాలకి దీటుగా పోటీగా తయారయ్యాయట. 2019 సంవత్సరం మొత్తం మీద - ఈ హోమ్‌ అసిస్టెంట్ల విషయంలో అమెజాన్‌దే పూర్తిగా పై చేయిగా సాగింది. 2020 లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగబోతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. సో... హోమ్‌ అసిస్టెంట్ల విషయంలో అమెజాన్‌ ప్రపంచ టెక్నో దిగ్గజాలకే సవాలు విసిరిందన్నమాట!

Updated Date - 2020-02-14T00:39:17+05:30 IST