ఉంగుటూరు సర్పంచ్ భర్తపై దాడిని ఖండిస్తున్నాం: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-06-15T14:41:21+05:30 IST

అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సర్పంచ్ భర్త సోమశేఖర్‌పై వైసీపీ నాయకులు మారణాయుధాలతో దాడి చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.

ఉంగుటూరు సర్పంచ్ భర్తపై దాడిని ఖండిస్తున్నాం: అచ్చెన్న

అమరావతి: అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సర్పంచ్ భర్త సోమశేఖర్‌పై వైసీపీ నాయకులు మారణాయుధాలతో దాడి  చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. రెండు నెలల్లో ఆరు సార్లు దాడి జరిగినా ఇంత వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. సర్పంచ్‌గా గెలిచిన నాయకులను అభివృద్ధి పనులు చేస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. దాడికి పాల్పడిన రాయపాటి శివ వెంటనే అరెస్ట్ చేయాలని అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలో, హోం మంత్రి సొంత జిల్లాలో ఇలాంటి దాడులు జరగటం సిగ్గుచేటని మండిపడ్డారు. 24 గంటల్లో దోషులను అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జగన్ రెడ్డి తలకిందులు తపస్సు చేసినా ప్రజల హృదయాల్లో, కార్యకర్తల గుండెల్లో చంద్రబాబు నాయుడు కోసం గూడుకట్టుకున్న అభిమానాన్ని చెరపలేరని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 


Updated Date - 2021-06-15T14:41:21+05:30 IST