అమరావతికి అన్ని జిల్లాల మద్దతు కావాలి

ABN , First Publish Date - 2020-09-27T07:34:23+05:30 IST

అమరావతి పరిరక్షణకు 29 గ్రామాలే కాకుండా పదమూడు జిల్లాల ప్రజల మద్దతు కావాలని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ పీవీ మల్లికార్జునరావు, రాష్ట్ర మహిళా...

అమరావతికి అన్ని జిల్లాల మద్దతు కావాలి

జంగారెడ్డిగూడెం, తడికలపూడిల్లో మద్దతు కోరిన అమరావతి పరిరక్షణ సమితి నాయకులు 


జీలుగుమిల్లి, సెప్టెంబరు: అమరావతి పరిరక్షణకు 29 గ్రామాలే కాకుండా పదమూడు జిల్లాల ప్రజల మద్దతు కావాలని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ పీవీ మల్లికార్జునరావు, రాష్ట్ర మహిళా కన్వీనర్‌ ఆర్‌. శైలజ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ జేఏసీ బలపడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, జంగారెడ్డిగూడెంలో జేఏసీ ఏర్పాటు చేయాలన్నారు. 284 రోజుల పాటు అమరావతి కోసం దీక్ష చేపట్టిన రైతుల కష్టాలను వివరిం చారు. అనంతరం జేఏసీ కన్వీనర్‌ జి.శ్రీనివాస్‌, రైతు చిక్కాల బసవయ్య, దళిత జేఏసీ కన్వీనర్‌ వేదవతి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌కే ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్‌, బీసీ నాయకులు ఎం.సత్యనారాయణ, న్యాయవాది అచ్యుత శ్రీనివాస్‌, లయన్స్‌ క్లబ్‌ నిరంజన్‌రావు, తూటిగుంట దుర్గారావు, బొబ్బర రాజ్‌పాల్‌, బిట్టిబోయిన రామలింగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


ప్రజా ఉద్యమానికి అందరూ మద్దతివ్వాలి..

కామవరపు కోట: అమరావతి ప్రజా ఉద్యమానికి ప్రతీ ఒక్కరూ మద్దతు తెలపాలని సమితి కన్వీనర్‌ పీవీ మల్లికార్జునరావు కోరారు. తడికలపూడిలో శనివారం సాయంత్రం జేఏసీ నేతలతో పర్యటించి పలు రాజకీయ పక్షాల నేతలతో కలిసి మాట్లాడారు. సమితి మహిళా జేఏసీ కన్వీనర్‌ శైలజ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజల మద్దతుతో అమరావతి రాజధానిగా ఏర్పాటు తథ్యమన్నారు. దళిత జేఏసీ నేత చిలకా బసవయ్య మాట్లాడుతూ అమరావతిని తరలించకుండా ఉండేలా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సమితి సభ్యులకు స్థానిక టీడీపీ నేతలు, రైతులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యలమంచిలి వేదవతి, టీడీపీ నాయకులు కోనేరు వెంకట సుబ్బారావు, దూతా లక్ష్మణరావు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T07:34:23+05:30 IST