అల... హంస వాహనంలో...

ABN , First Publish Date - 2020-11-30T05:18:39+05:30 IST

కార్తీకపౌర్ణమి సందర్భంగా పవిత్ర కృష్ణానది అలలపై హంస వాహనంలో బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం కనులపండువగా జరిగింది.

అల... హంస వాహనంలో...
నాగహారతి ఇస్తున్న అర్చకులు, కృష్ణానదిలో హంసవాహనంపై స్వామివార్ల తెప్పోత్సవం

అమరావతి, నవంబరు 29: కార్తీకపౌర్ణమి సందర్భంగా పవిత్ర కృష్ణానది అలలపై హంస వాహనంలో బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. ఆదివారం సాయంత్రం ఉత్సవమూర్తుల గ్రామోత్సవం అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. ఐదుగురు అర్చకులు ప్రత్యేక స్టేజీలపై నిల్చొని ధూప, పంచ, నంది, కుంభ, నాగ, నక్షత్ర, కర్పూర హారతులను నదీమాతకు సమర్పించారు. తొలుత ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి పసుపు, కుంకుమ సమర్పించారు. శంభోశంకర సాంబశివ.. శివ అంటూ భక్తుల నామస్మరణల మధ్య  తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఈవో సునీల్‌కుమార్‌ పర్యవేక్షించారు. 

Updated Date - 2020-11-30T05:18:39+05:30 IST