Abn logo
Apr 11 2021 @ 01:10AM

విద్యుత్‌నగర్‌లో చోరీ

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 10:  విద్యుత్‌నగర్‌లో ఓ ఇంటిలో చోరీ జరిగింది.  కొన్ని రోజుల క్రితం ఇంటి యజమాని కముజు రవివిజయకుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని కుమారుడి వద్దకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం ఇంటి తలుపులు తెరచి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ అక్కడకు  చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని రెండు బీరువాలు తెరిచి ఉండడంతో పాటు సామగ్రిని చిందరవందర చేశారు. వెండి, బంగారు ఆభరణాలు చోరికి గురైనట్టు పోలీసుల  గుర్తించారు.  ఇంటి యజ మాని  వచ్చిన తరువాత వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.Advertisement
Advertisement
Advertisement