Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 3 2021 @ 16:39PM

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' నేనే: ప్రియాంక టిబ్రెవాల్

కోల్‌కతా: భవానీపుర్ ఉప ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రియాంక టిబ్రెవాల్‌పై 58,389 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే తన ఓటమిపై ప్రియాంక స్పందించారు. ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నానని అన్నారు. అయితే ఈ ఆటలో తాను ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్''గా నిలిచానని చెప్పారు. మమతా బెనర్జీకి గట్టిపట్టు ఉన్న నియోజకవర్గంలో తాను పోటీ చేసి, 25,000కు పైగా ఓట్లు గెలుచుకున్నానని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచానని అన్నారు. మునుముందు మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. కాగా, మమతాబెనర్జీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈసీ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement