రెడ్డి సంక్షేమ సంఘానికి నాలుగు ఎకరాలు కేటాయింపు

ABN , First Publish Date - 2022-01-27T06:30:41+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంక్షేమ సంఘం భవనం, కల్యాణ మండపం, వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

రెడ్డి సంక్షేమ సంఘానికి నాలుగు ఎకరాలు కేటాయింపు
పత్రాలను అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల టౌన్‌, జనవరి 26: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంక్షేమ సంఘం భవనం, కల్యాణ మండపం, వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. బుధవారం హైదరాబాద్‌ ప్రగతి భవనలో మంత్రి కేటీఆర్‌ రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా నాయకులకు స్థలం కేటాయింపు ఉత్తర్వులను(జీవో) అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. కలెక్టరేట్‌ పరధిలోని తొమ్మిదో ప్యాకేజీ పక్కన ఉన్న సర్వే నంబరు 135లోని ప్రభుత్వ స్థలంలో నాలుగు ఎకరాలను కేటారుంచారని, త్వరలో మంత్రి కేటీఆర్‌ సహకారంతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని అన్నారు. సంఘానికి నాలుగు ఎకరాల స్థలం కేటాయించి ఉత్తర్వులు అందించిన మంత్రి కేటీఆర్‌కు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో జడ్పీ చైర్‌  పర్సన్‌ న్యాలకొండ అరుణ, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరి రాంరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నేవూరి మమతారెడ్డి, నాయకులు నేవూరి వెంకట్‌రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, పాతూరి మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-27T06:30:41+05:30 IST