కొడగులో సైనికుడు అల్తాఫ్‌ అహ్మద్‌ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-02-27T18:04:54+05:30 IST

శ్రీనగర్‌ మంచులో చిక్కుకుని అమరుడైన కొడగు జిల్లాకు చెందిన సైనికుడు అల్తాఫ్‌ అహ్మద్‌ (37)కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం విరాజ్‌పేటలో అంత్యక్రియలలో కుటుంబ సభ్యులు,

కొడగులో సైనికుడు అల్తాఫ్‌ అహ్మద్‌ అంత్యక్రియలు

                  - పతాకం స్వీకరించేవేళ కుప్పకూలిన భార్య 


బెంగళూరు: శ్రీనగర్‌ మంచులో చిక్కుకుని అమరుడైన కొడగు జిల్లాకు చెందిన సైనికుడు అల్తాఫ్‌ అహ్మద్‌ (37)కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం విరాజ్‌పేటలో అంత్యక్రియలలో కుటుంబ సభ్యులు, అధికారులు, మాజీ సైనికులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సైనికులు, జిల్లా పోలీసులు 21 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అమరుడైన అల్తాఫ్‌ అహ్మద్‌కు గౌరవవందనం సమర్పించారు. సైన్యం నుంచి డీఎస్‌సీ విభాగంవారు గాడ్‌ ఆఫ్‌ హానర్‌ సమర్పించారు. సైనిక అధికారులు జాతీయ పతాకాన్ని అల్తాఫ్‌ భార్య జుబేరియాకు అప్పగించేవేళ ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. కాసేపు వైద్యుల పర్యవేక్షణ తర్వాత కోలుకున్నారు. ఈనెల 23న శ్రీనగర్‌లో మం చులో చిక్కుకుని హవాల్దార్‌ అల్తాఫ్‌ అహ్మద్‌ అమరుడయ్యారు. ఏఓసీ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అల్తాఫ్‌ కుటుంబం పదేళ్లుగా కేరళలోని మట్టనూరు జిల్లాలో నివసిస్తున్నారు. విరాజ్‌పేట్‌లోని మీనుపేటలో జన్మించిన అల్తాఫ్‌ పీయూ స్థాయిదాకా చదివి సైన్యంలో చేరారు. అల్తాఫ్‌ భార్య ఇదే ప్రాంతంలోని ఎడపాలకు చెందినవారు. 19 ఏళ్లుగా సైన్యంలో అల్తాఫ్‌ విధులు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-02-27T18:04:54+05:30 IST