Abn logo
Aug 3 2021 @ 22:48PM

సేవా పన్నులను వ్యతిరేకించాలి

మాట్లాడుతున్న అఖిలపక్ష నేతలు

అఖిలపక్షం నేతల పిలుపు

కావలి, ఆగస్టు 3: ఇంటి పన్నులు చెల్లిస్తున్నా ప్రజలపై భారం మోపుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అదనపు పన్నులను ప్రజలు వ్యతిరేకించాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జర్నలి్‌స్టక్లబ్‌లో అఖిలపక్ష నేతలు దామా అంకయ్య, చింతాల వెంకట్రావు, పసుపులేటి పెంచలయ్య, గుత్తికొండ కిషోర్‌బాబు, జ్యోతి బాబూరావు, కరువాది భాస్కర్‌, డేగా సత్యనారాయణలు విలేకర్లతో మాట్లాడారు. పన్నులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 3 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. చెత్తకు పన్ను ఏమిటని, ఈ సేవా పన్నులను కట్టే అలవాటు చేస్తే మున్ముందు అనేక రకాల పన్నులను ప్రభుత్వం ప్రజలపై మోపుతుందన్నారు. ఈ సేవా పన్నులు ఇంటి యజమానులకే కాక అద్దెకు ఉంటున్న వారికి కూడా భారం పడుతుందన్నారు. సేవా పన్నులు కట్టకపోతే  పథకాలు రద్దు చేస్తామని వలంటీర్లు ఇంటింటికి తిరిగి బెదిరించడం సబబుకాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. వెంటనే పన్నుల పెంపు జీవోలను రద్దు చేసి పన్నుల వసూళ్లను విరమించకపోతే ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.