మానవులతో ఏలియన్ల శృంగారం!

ABN , First Publish Date - 2022-04-08T08:43:36+05:30 IST

గ్రహాంతరవాసులు(ఏలియన్స్‌) నిజంగా ఉన్నారా? హాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే ఫ్ల యింగ్‌ సాసర్లలాంటి ఏలియన్‌ స్పేస్‌షిప్‌(యూఎ్‌ఫవో) లు నిజమేనా? అంటే..

మానవులతో ఏలియన్ల శృంగారం!

8 గ్రహాంతరవాసుల వల్ల మహిళకు గర్భం?


లండన్‌, ఏప్రిల్‌ 7: గ్రహాంతరవాసులు(ఏలియన్స్‌) నిజంగా ఉన్నారా? హాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే ఫ్ల యింగ్‌ సాసర్లలాంటి ఏలియన్‌ స్పేస్‌షిప్‌(యూఎ్‌ఫవో) లు నిజమేనా? అంటే.. అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(డీఐఏ)’ ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఇస్తోంది! ఏలియన్స్‌ ఉండడమే కాదు.. 5 సందర్భాల్లో గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటనలు కూడా నమోదయ్యాయని, ఒక మహిళ ఏలియన్స్‌ వల్ల గర్భం దాల్చిందని లిఖితపూర్వక నివేదిక సైతం ఇచ్చింది! ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒకచోట మనలాంటి బుద్ధిజీవులు.. మనకన్నా తెలివైన, టెక్నాలజీ పరంగా మరింత ఉన్నతస్థాయిలో ఉన్న జీవులు ఉండొచ్చని ఒక ప్రతిపాదన. ఒకవేళ వాళ్లు మనకన్నా తెలివైనవాళ్లు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు అయితే మానవజాతి మనుగడకే ముప్పు. అయితే, కొందరు పైలట్లు తాము విమానం నడుపుతున్నప్పుడు యూఎ్‌ఫవోలను చూసినట్టు చెప్పారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తాము ఏలియన్లను, వారి స్పేస్‌షి్‌ప్సను చూశామన్నారు. వీటన్నింటి నేపథ్యంలో అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ.. అడ్వాన్స్‌డ్‌ ఏవియేషన్‌ థ్రెట్‌ ఐడెంటిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (ఏఏటీఐపీ) పేరిట 2007 నుంచి 2012 దాకా ఒక ప్రాజెక్టును నిర్వహించింది. అంటే.. మన వద్ద ఉన్న టెక్నాలజీని మించిన సాంకేతిక పరిజ్ఞానంతో రోదసి నుంచి ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉందేమో అంచనా వేసే ప్రాజెక్ట్‌ అన్నమాట. డీఐఏ మాజీ చీఫ్‌ లూయిస్‌ ఎలిజోండో 2017లో ఈ ప్రాజెక్టు గురించి నోరుజారారు. దీంతో ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలివ్వాలంటూ సన్‌ పత్రిక ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌’ కింద డీఐఏని కోరింది. కానీ, వివరాలిచ్చేందుకు డీఐఏ నిరాకరించింది. ఎట్టకేలకు నాలుగేళ్ల పోరాటం తర్వాత ఇటీవలే 1574 పేజీల నివేదికను సమర్పించింది. గ్రహాంతరవాసుల ఉనికిని అందు లో నిర్ధారించింది. అంతేకాదు గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటనలు ఐదు నమోదయ్యాయని, ఒక మహిళ గర్భం దాల్చినట్టు సాక్షులు పేర్కొన్నారని వెల్లడించింది.  నివేదికలో ముఖ్యాంశాలు..


 గ్రహాంతరవాసుల నౌకలకు సమీపంగా వెళ్లిన విమానాల్లోని పైలట్లు రేడియేషన్‌కు గురయ్యారు. మరికొందరు మెదడు సమస్యలు, నాడులు దెబ్బతినడం, పక్షవాతం వంటి ఇబ్బందులకు గురయ్యారు. 

 ఏలియన్స్‌ వల్ల ఆరోగ్య సమస్యలకు గురైన 42 కేసు లు వైద్యరికార్డుల్లో నమోదయ్యాయి. రికార్డులకు ఎక్కని ఘటనలు దాదాపు 300.

 ఏలియన్స్‌ ప్రభావం వల్ల కొంతమంది కాలం స్తంభించిపోయిన భావనకు గురయ్యారు.

 ఏలియన్లు మానవులను అపహరించిన ఘటనలు 129 నమోద య్యాయి. వారి వ్యోమనౌకల వల్ల మానవుల వాహనాలు విద్యుదయస్కాంత ప్రభావానికి గురైన ఘటనలు 77 నమోదయ్యాయి. కాలాన్ని నష్టపోయామని 75 మంది చెప్పగా, 41 మందికి ఏలియన్స్‌ వల్ల కాలినగాయాలయ్యాయి. 23 మంది కరెంట్‌షాక్‌కు గురయ్యారు. కాలాన్ని నష్టపోవడమంటే.. యూఎ్‌ఫవోలకు దగ్గరగా వెళ్లి న విమానాల్లోని పైలట్లకు 5 నిమిషాలు గడిచినట్లు అనిపించింది. కానీ తర్వాత గడియారం చూసుకుం టే అరగంట గడిచిపోయింది.  

 ఏఐటీటీపీ ప్రాజెక్టులో భాగంగా గ్రహాంతరవాసుల గురించే కాక.. దెయ్యాలు, భూతాలకు సంబంధించిన ఘటనలు, వాటి వల్ల గాయపడిన, మరణించిన దృష్టాంతాలను నివేదికలో పేర్కొన్నది.


Updated Date - 2022-04-08T08:43:36+05:30 IST