ప్రజాప్రతినిధులు అలర్ట్‌

ABN , First Publish Date - 2020-07-05T11:12:16+05:30 IST

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా, ఆలేరు ఎమ్మెల్యే

ప్రజాప్రతినిధులు అలర్ట్‌

పర్యటనలకు విరామం ఇచ్చే యోచనలో ఎమ్మెల్యేలు


నల్లగొండ, జూలై 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి కరోనా బారినపడటంతో ప్రజాప్రతినిధులు గుబులు చెందుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెంది న పలువురు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ రావడంతో జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. తక్కువ మందితో హాజరవడంతోపాటు, కార్యక్రమాన్ని తొందరగా ముగిస్తున్నారు. జనం మీదపడకుండా గన్‌మెన్లు రక్షణగా ఉంటున్నారు. ఫిర్యాదులను సైతం నేరుగా స్వీకరించకుండా, వ్యక్తిగత సిబ్బందికి ఇవ్వాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు.


ఇటీవల మంత్రి కేటీఆర్‌ పర్యటన రోజే మండలి చైర్మన్‌, ఎమ్మెల్యేలు, వారి సిబ్బంది పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకే గొంగిడి దంపతులకు పాజిటివ్‌ వచ్చింది. కాళేశ్వరం కాల్వల ప్రారంభంలో పెద్ద సంఖ్యలో జనంతో హాజరవ్వడం వల్లే వీరికి కరోనా వైరస్‌ సోకినట్టు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌కు కూడా పాజిటి వ్‌ నిర్ధారణ అయింది. తాజా పరిణామాలతో జిల్లా ఎమ్మెల్యేలు 15 రోజుల పాటు కార్యక్రమాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఉపాధి హామీ, పీఎంజీఎ్‌సవై వంటి పథకాల కింద నిధులు రావడంతో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు ప్రారంభించాలని ఎమ్మెల్యేలు ప్రణాళిక రూపొందించుకోగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటిని రద్దుచేసుకునే యోచనలో ఉన్నారు.

Updated Date - 2020-07-05T11:12:16+05:30 IST