Advertisement
Advertisement
Abn logo
Advertisement

తల్లి ద్వారానే అలర్జీ!

ఆంధ్రజ్యోతి(04-08-2020)

తల్లి పాలు బిడ్డకు అమృత సమానం. అయితే కొంతమంది పసికందుల్లో తల్లి పాలు అలర్జీని కలిగిస్తాయి. ఇందుకు దోషం తల్లిపాలలో కాదు, తల్లి తినే ఆహారంలో ఉంటుంది. ఒంటి మీద దద్దుర్లు, అపానవాయువులు వదలడం, త్రేన్పులు, వాంతులు, బంక విరేచనాలు, బిడ్డ చికాకుగా, ఏడుస్తూ ఉండడం... ఇవన్నీ తల్లిపాలు సరిపడని పసికందుల్లో కనిపించే ప్రధాన లక్షణాలు. బిడ్డలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. 


అలర్జీ కారకాలు: తల్లి పాలు బిడ్డకు అలర్జీని కలిగించవు. అయితే తల్లి తీసుకునే ఆహారంలో ఆవు పాలు, సోయా, వేరుసెనగలు, ఇతర నట్స్‌, గుడ్లు, గోధుమలు, షెల్‌ ఫిష్‌ ఉంటే వాటి వల్ల పాలు తాగే బిడ్డకు అలర్జీ తలెత్తుతుంది. తల్లి ఆయా పదార్థాలు తిన్న అరగంటలోనే వాటిలోని మాంసకృత్తులు స్వల్ప పరిమాణాల్లో తల్లి పాలల్లోకి చేరతాయి. తల్లి పాలు తాగడం ద్వారా అవి బిడ్డలోకి చేరి అలర్జీని కలిగిస్తాయి. 


కనిపెట్టాలి: బిడ్డకు అలర్జీకి కారణం అవుతున్న పదార్థాలను తల్లులు తెలివిగా కనిపెట్టాలి. ఏవి తిన్న తర్వాత బిడ్డలో అలర్జీ తలెత్తుతుందో ఒక్కొక పదార్థాన్నీ మార్చి, మార్చి కనిపెట్టాలి. ఏ పదార్థాన్ని ఆపిన తర్వాత బిడ్డలో అలర్జీ లక్షణాలు ఆగుతున్నాయో తెలుసుకోవాలి. ఇందుకు ఐదు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. అలా కనిపెట్టిన పదార్థాన్ని ఆహారంలో లేకుండా చూసుకోవాలి.


Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...