Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్షుడిపై అలమేలు మంగమ్మ

ఉదయం.. ఉట్టి కృష్ణుడిగా సర్వభూపాల వాహనంపై అమ్మవారు, సాయంత్రం.. శ్రీమహాలక్ష్మిగా పద్మావతీ దేవి, రాత్రి.. గరుడ వాహనంపై అమ్మవారు

సర్వభూపాలుడిపై సిరుల తల్లి 


తిరుచానూరు, డిసెంబరు 5: శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారు శ్రీవారి పాదాలు ధరించి భక్తులను అనుగ్రహించారు. వేకువజామున అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం ఆలయం నుంచి అమ్మవారిని వాహన మండపానికి వేంచేపు చేసి పట్టుపీతాంబర, స్వర్ణ ఆభరణాలతో ఉట్టికృష్ణుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై అధిష్టింపజేశారు. మధ్యాహ్నం కేటీ మండపంలో పాంచరాత్రి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం సర్వభూపాల వాహనాన్ని రథోత్సవ నమూనాలో అలంకరించి సౌభాగ్యలక్ష్మి అలంకరణలో అమ్మవారిని అధిష్టింపజేశారు. రాత్రి అమ్మవారు శ్రీవారి పాదాలు ధరించి గరుడ వాహనంపై అభయమిచ్చారు. అనంతరం వాహన మండపంలో అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో జీయర్‌స్వాములు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరీబాయి, ఏఈవో ప్రభాకరరెడ్డి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, పర్యవేక్షకులు శేషగిరి, మధుసూదన్‌, ఏవీఎస్వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement