హైదరాబాద్ సిటీ/రాంనగర్ : దసరా పండగను పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే అలయ్ - బలయ్ (దసరా సమ్మేళనం) ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో నిర్వహిస్తున్నట్లు హరియాణా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి తెలిపారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతోపాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై, ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.