అక్రమాలకు పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యమే కారణం

ABN , First Publish Date - 2022-08-17T07:00:22+05:30 IST

గోకవరంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు, అక్రమాలకు పంచాయతీ కా ర్యదర్శి నిర్లక్ష్యమే కారణమని స్థానిక బహు జన పరిరక్షణ సమితి, భీమ్‌ సైనిక్‌ సభ్యులు ఆరోపించారు.

అక్రమాలకు పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యమే కారణం

 బహుజన పరిరక్షణ, భీమ్‌ సైనిక్‌ సభ్యులు

గోకవరం, ఆగస్టు 16: గోకవరంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు, అక్రమాలకు పంచాయతీ కా ర్యదర్శి నిర్లక్ష్యమే కారణమని స్థానిక బహు జన పరిరక్షణ సమితి, భీమ్‌ సైనిక్‌ సభ్యులు ఆరోపించారు. గోకవరంలో మంగళ వారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వా రు మాట్లాడుతూ గ్రామంలో నిత్యం చోటు చేసుకుంటున్న అక్రమ పరిణామాలపై పంచాయతీ కార్యదర్శికి అనేకమా ర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇటీవల నారావారి చెరువు గట్టుపై పురాతన కాలంనాటి భారీ వృక్షాన్ని కొందరు అక్కమార్కులు అక్రమంగా నరికి భారీగా సొమ్ముచేసుకున్న విషయం కార్యదర్శి దృష్టికి తీసికెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. డ్రైవర్స్‌ కోలనీ మార్గంలోని ఊరకాలువ వంతెన ప్రక్కన మరొక  భారీ వృక్షాన్ని మాయం చేసిన కేటుగాళ్లపై కూడా చర్య లు లేవన్నారు. ఠాణా సెంటర్‌ సమీపంలో రెవెన్యూ రికార్డులో బావి ప్రాంతంగా నిర్ధేశిస్తూ ఉన్న ఒక సెంటు భూమిన అక్రమ నిర్మాణం జరుగుతున్నా కార్యదర్శి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అక్రమాలపై పోరాడుతున్న తమపై అక్కమా ర్కులను పంచాయతీ కార్యదర్శి దాడికి ఉసుగొల్పుతు న్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ గోకవరంలో ఇటువంటి అక్రమాలు, ఆక్రమణలు జరగలేదని, ప్రస్తుత కార్యదర్శి బాధ్యతలు చేపట్టాకే అక్రమాలకు దారులు తెరుచుకున్నాయని అసహనాన్ని వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా కార్యదర్శి వ్యవహరశైలి మారకపోతే ఉద్యమరూపంలో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు హెచ్చ రించారు.  బహుజన పరిరక్షణ సమితి, భీమ్‌ సైనిక్‌ సభ్యులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-17T07:00:22+05:30 IST