Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘అధికారంతో పేట్రేగిపోతున్న వైసీపీ శ్రేణులు’

ప్రత్తిపాడు, డిసెంబరు 7: అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయని అఖిల పక్ష నాయకులు విమర్శించారు. మండలంలోని చింతలూరు గ్రామంలోని బాధిత దళితవాడను మంగళవారం సీపీఎం, సీపీఐఎంఎల్‌, న్యూడెమోక్రసీ, లిబరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం, అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు సందర్శించారు. చింతలూరులో దాడులకు గురైన బాధితులు 41మందిపై కేసులుపెట్టి 35 మంది ని సెంట్రల్‌ జైలుకు తరలించారని, నెలరోజులు దాటి నా వారికి బెయిల్‌ రాలేదని బాధితులు అఖిలపక్ష బృం దం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్ష నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, దువ్వాశేషుబాబ్జి, జె.వెంకటేశ్వర్లు, గొడుగు సత్యనారాయణ, ఏగుపాటి అర్జునరావు, రేచుకట్ల సింహాచలం, వల్లూరి రాజబాబు, టి.బసవయ్య మాట్లాడుతూ చింతలూరు దళితులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. చింతలూరు బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దళితులపై కేసులను ఎత్తివేసి జైలులో ఉన్నవారిని విడుదల చేయాలని, చింతలూరులోని పేదల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 13న చింతలూరు వ్యవహారంపై కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్టు నాయకులు తెలిపారు. 

Advertisement
Advertisement