అవి ఓట్ల బుల్డోజర్లు: బీజేపీపై అఖిలేష్ విమర్శలు

ABN , First Publish Date - 2021-12-02T00:01:36+05:30 IST

మేము సమాజ్‌వాదీ ప్రజలం. పేద ప్రజల సమస్యలు ఏంటో మాకు బాగా తెలుసు. ఎందుకంటే మేమంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. కాబట్టి మాకు కూలీలు, రైతుల సమస్యలు కూడా అందరి కంటే ఎక్కువగా అర్థం అవుతాయి. కుటుంబంలోని వ్యక్తులే కుటుంబ సమస్యల్ని బాగా అర్థం చేసుకుంటారు..

అవి ఓట్ల బుల్డోజర్లు: బీజేపీపై అఖిలేష్ విమర్శలు

లఖ్‌నవూ: ‘యోగి ప్రభుత్వం కావాలా, యోగ్యమైన ప్రభుత్వం కావాలా?’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. తాజాగా బీజేపీ ‘బుల్డోజర్’ వ్యాఖ్యలను ఊటంకిస్తూ విమర్శలు గుప్పించారు. అవినీతిపరులపై నేరస్తులపై బుల్డోజర్లు ఎక్కిస్తామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అవి ‘ఓట్ల బుల్డోజర్లు’ అంటూ ఎద్దేవా చేశారు. బుల్డోజర్లు రోడ్లపై నడవాలని, కానీ బీజేపీ బుల్డోజర్లు ప్రజలపైకి ఎక్కి నడుస్తున్నాయని అఖిలేష్ విమర్శలు గుప్పించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని బండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అఖిలేష్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


‘‘మేము సమాజ్‌వాదీ ప్రజలం. పేద ప్రజల సమస్యలు ఏంటో మాకు బాగా తెలుసు. ఎందుకంటే మేమంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. కాబట్టి మాకు కూలీలు, రైతుల సమస్యలు కూడా అందరి కంటే ఎక్కువగా అర్థం అవుతాయి. కుటుంబంలోని వ్యక్తులే కుటుంబ సమస్యల్ని బాగా అర్థం చేసుకుంటారు. కుటుంబం లేని వ్యక్తులు కుటుంబ సమస్యల్ని ఎలా అర్థం చేసుకుంటారు?’’ అని అఖిలేష్ అన్నారు. ఇక యోగి బుల్డోజర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘‘ఇది బుల్డోజర్ల ప్రభుత్వం. సహజంగా బుల్డోజర్లు రోడ్లపై వెళ్తుంటాయి. కానీ బీజేపీ వాళ్ల బుల్డోజర్లు ప్రజలపైకి ఎక్కి నడుస్తుంటాయి’’ అని అన్నారు.

Updated Date - 2021-12-02T00:01:36+05:30 IST