సంఘటిత కార్మిక ఉద్యమాలే శరణ్యం

ABN , First Publish Date - 2022-05-02T06:08:51+05:30 IST

దేశాన్ని కాపాడుకునేందుకు సంఘటిత కార్మిక పోరాటాలే శరణ్యమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు.

సంఘటిత కార్మిక ఉద్యమాలే శరణ్యం

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు 

ధర్నాచౌక్‌, మే 1 : దేశాన్ని కాపాడుకునేందుకు సంఘటిత కార్మిక పోరాటాలే శరణ్యమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సెంట్రల్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌, ఆఫీసర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మహాసభలు నగరంలోని ఏ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, వీరోచిత పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. 74ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో కార్మికుల తమ రక్తాన్ని, చెమటను ధారబోసి ఏర్పాటు చేసుకున్న అనేక రకాల ప్రభుత్వం రంగ సంస్థలను ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం పాలకులు చేస్తున్నారన్నారు. భారత రాజ్యాంగం స్థానంలో ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ రహస్య ఎజెండాను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, తద్వారా కార్మిక ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 44 చట్టాల స్థానంలో నాలుగు కోడ్‌లుగా మార్చి హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోరాటాలు చేసి సాధించుకున్న 8 గంటల పనిదినాల స్థానంలో 12 గంటల పనిదినాల చట్టంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలను దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్వాలంబన దెబ్బతినకుండా పురోగామి శక్తులు ఏకమై కార్మిక దినం మే డే స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేసి ఉద్యమాలకు మరో స్వాతంత్ర్యానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఏఐబీఈఏ జాతీయ ప్రధానకార్యదర్శి సిహెచ్‌.వెంకటాచలం, బి.రాంబాబు, వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలి

నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని సీపీఎం 19వ డివిజన్‌ శాఖ కార్యదర్శి మాతంగి రత్నమాల డిమాండ్‌ చేశారు. మే డే, సుందరయ్య జయంతిని పురస్కరించుకుని స్థానిక 19వ డివిజన్‌లోని జార్జ్‌పేటలో ఆమె జెండా ఆవిష్కరణ చేసి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళిలర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఐటీయూ నగర కార్యదర్శి కోటబాబు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి బెనర్జీ, పార్టీ నేతలు రవి, వెంకటరత్నం, ఎస్‌ఎ్‌సఐ నేత బాబి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-02T06:08:51+05:30 IST