Abn logo
Oct 27 2021 @ 23:41PM

రైతుల మృతికి కారణమైన మంత్రిని ఉరితీయాలి

రైతుల చితాభస్మాన్ని పెన్నాలో కలుపుతున్న నాయకులు

ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌

రైతుల చితాభస్మాం పెన్నాలో నిమజ్జనం 


నెల్లూరు (వైద్యం), అక్టోబరు 27 : ఉత్తరప్రదేశ్‌లో రైతుల మృతికి కారణమైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను ఉరితీయాలని ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఘటనలో అమరులైన రైతుల చితాభన్మాన్ని బుధవారం పెన్నా నదిలో కలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రైతులకు సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లును, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, రైతు నాయకులు రమణయ్య నాయుడు, సీహెచ్‌ రమణారెడ్డి, షాన్‌వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.