అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-01-19T07:15:01+05:30 IST

అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేసి, కోల్పోయిన వారిని వెంటనే ఆదుకోవాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు జాఫర్‌, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప.. ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి
నిరసన ప్రదర్శన చేస్తున్న సీపీఐ, అగ్రిగోల్డ్‌ బాధితులు


అనంతపురం క్లాక్‌టవర్‌/ప్రె్‌సక్లబ్‌, జనవరి 18: అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేసి, కోల్పోయిన వారిని వెంటనే ఆదుకోవాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు జాఫర్‌, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప.. ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట అగ్రిగోల్డ్‌ బాధితులు, సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించా రు. జాఫర్‌, నారాయణప్ప మాట్లాడుతూ 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్‌ కంపెనీ, కోర్టు విషయాలను పక్కనపెట్టి మూడు నెలల్లోపు రూ.20వేలలోపు ఉన్న 13 లక్షల మంది డిపాజిటర్లకు రూ.1150 కోట్లు జమ చేస్తామనీ, మిగిలిన వారికి ఆరు నెలల్లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చి, అమలు చేయటంలో విఫలమయ్యారన్నారు. విడతల వారీగా జమ చేస్తామని చెప్పి, నేటికీ బాధితులకు న్యాయం చేయకపోవటం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం చొరవచూపి అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్‌ఓ గాయత్రీదేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు శ్రీరాములు, లింగమయ్య, కేశవరెడ్డి, అగ్రిగోల్డ్‌ బాధితులు సిద్దేశ్వర, కుళ్లాయప్ప, నాగరాజు, ఎర్రిస్వామి, నగేష్‌, ధనుంజయ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T07:15:01+05:30 IST