ఆధునిక సాగు నైపుణ్యాలతో వ్యవసాయాభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-05T05:59:28+05:30 IST

ఆధునిక సాగు నైపుణ్యాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయవచ్చని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి చెప్పారు.

ఆధునిక సాగు నైపుణ్యాలతో వ్యవసాయాభివృద్ధి

అనకాపల్లి అగ్రికల్చర్‌, డిసెంబరు 4: ఆధునిక సాగు నైపుణ్యాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయవచ్చని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి చెప్పారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శుక్రవారం జరిగిన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రసగించారు. రైతుల్లో సాగు నైపుణ్యాలను పెంచేందుకు వ్యవసాయ విజ్ఞాన వాహనాన్ని ప్రారంభించామని చెప్పారు. సమావేశంలో దసాల్ట్‌ సిస్టమ్స్‌ ఎండీ దీపక్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌ డీవీ రామకోటిరెడ్డి, సీజీఎం కె.రవి, వరప్రసాద్‌రెడ్డి, సెంచ్యూరియన్‌ వర్సిటీ వీసీ జేఎస్‌ఎన్‌రాజు, వైసీపీ నాయకులు దాడి రత్నాకర్‌, కె.విష్ణుమూర్తి ప్రసంగించారు. అనంతరం వ్యవసాయ విజ్ఙాన వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.భరత్‌లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:59:28+05:30 IST