8750 ఎకరాల్లో నేలవారిన వరి పంట

ABN , First Publish Date - 2020-11-28T06:21:32+05:30 IST

సామర్లకోట, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కాకినాడ వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో సామర్లకోట, పెదపూడి, కాకినాడ అర్బన్‌, రూరల్‌ మండలాల్లో 8750 ఎకరాల్లో వరి పంట నేలవారిందని కాకినాడ వ్యవసాయశాఖ ఏడీ పద్మశ్రీ వెల్లడించారు

8750 ఎకరాల్లో నేలవారిన వరి పంట
తిమ్మాపురంలో వరి పనలను పరిశీలిస్తున్న ఏడీ

కాకినాడ వ్యవసాయశాఖ ఏడీ పద్మశ్రీ 

సామర్లకోట, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కాకినాడ వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో సామర్లకోట, పెదపూడి, కాకినాడ అర్బన్‌, రూరల్‌ మండలాల్లో 8750 ఎకరాల్లో వరి పంట నేలవారిందని కాకినాడ వ్యవసాయశాఖ ఏడీ పద్మశ్రీ వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా సామర్లకోట మండలం అచ్చంపేట, కొప్పవరం, పనసపాడు, పి.వేమవరం తదితర గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను శుక్రవారం ఏడీ, ఏవో యిమ్మిడిశెట్టి సత్య పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఏడీ మాట్లాడుతూ 1350 ఎకరాల పంట కుప్పలపై, 270 ఎకరాలల్లో పంట పనలపై ఉందన్నారు. నీట మునిగిన పనల మడుల నుంచి నీరు కిందికి వెళ్లేలా రైతులు బాటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రెండు దఫాలు పంట నష్టపోగా ఉన్న వాటిని ఒబ్బిడి చేసుకునే సమయంలో తుఫాన్‌ తమను నిలువునా ముంచిందని రైతులు అధికారుల ఎదుట వాపోయారు. నష్టాన్ని కొంతమేరైనా పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్‌ సలాది బ్రహ్మానందరావు కోరారు. గతనెల వచ్చిన ఏర్పడిన వరదలు, వర్షాలతో పంటనష్టాన్ని నమోదు చేశామని, నివర్‌ తుఫాన్‌ వల్ల ఏర్పడిన నష్టాన్ని నమోదు చేసి ప్రభుత్వం నష్ట పరిహారం అందేలా సిఫారసు చేస్తామని ఏడీ తెలిపారు.

రబీలో వరినాట్లు పూర్తవ్వాలి

సర్పవరం జంక్షన్‌: రబీలో వరినాట్లు డిసెంబరు 5తేదీ నాటికి పూర్తయ్యేలా రైతులు సమాయత్తం కావాలని ఏడీ పద్మశ్రీ సూచించారు. కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలో తడిసిన వరి పనలను ఏవో ఎం.సురే్‌షకుమార్‌తో కలసి ఆమె పరిశీలించారు. ఏడీ మాట్లాడుతూ రబీ లో వరిసాగు కోసం పంట కాలువలకు నీటిని డిసెంబరు 1న ఇరిగేషన్‌ అధికారులు విడుదల చేస్తారని, కాలువలకు సాగునీటి సరఫరాను మార్చి నెలాఖరునాటికి నిలుపుదల చేస్తారన్నారు. స్వల్పకాలిక తక్కువ రోజుల్లో పంట చేతికొచ్చే సన్న రకాలైన ఎంటీయూ 1121, 1153, 1156 రకాలను సాగు చేపట్టాలని ఆమె కోరారు. బొండాలు సాగుచేసినట్టయితే వెదజల్లు డిసెంబరు 5లోపు పూర్తి చేయాలని, మిగతా రకాల సాగు 10 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అపరాలు కావాల్సిన రైతులకు విత్తనాలు ఆర్‌బీకేలలో సిద్ధంగా ఉంచుతామని ఏడీ తెలిపారు. వీఏఏ ఆమని, అశ్విని పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-28T06:21:32+05:30 IST