Abn logo
Sep 18 2021 @ 01:43AM

ప్రభుత్వ పథకాలపై అవగాహన ముఖ్యం

మాట్లాడుతున్న వ్యవసాయ అధికారులు

మండల స్థాయి ఏఏబీ శిక్షణలో అధికారులు

నెల్లూరు(వ్యవసాయం), సెప్టెంబరు 17 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలపై అవగాహన ఎంతో ముఖ్యమని పలువురు అధికారులు వ్యవసాయ సలహా మండలి(ఏఏబీ) సభ్యులకు సూచించారు. నెల్లూరులోని రైతు శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఏఏబీ సభ్యులకు మండల స్థాయి శిక్షణ తరగతులు జరిగాయి. నెల్లూరు సహాయ వ్యవసాయ సంచాలకుడు బాలాజీనాయక్‌ రైతు భరోసా కేంద్రాల ప్రాముఖ్యత, ఎరువులు, విత్తనాలు ఆర్‌బీకేలలో అందుబాటులో ఉండడంపై అవగాహన కల్పించారు. కౌలు కార్డుల గురించి తెలియజేశారు. ఆరుతడి పంటలు, సమగ్ర సస్యరక్షణ పద్దుతులపై రైతు శిక్షణా కేంద్రం ఏవో శిరీషారాణి, ధరల స్థిరీకరణ, ఈ-మార్కెటింగ్‌పై ఏఎంసీ కార్యదర్శి రామాంజనేయులు వివరించారు. బిందు, తుంపర్ల సేద్యంపై ఏపీఎంఐపీ ఏపీడీ గోపిచంద్‌, జొన్న విత్తనాల సబ్సిడీ, పశువుల వ్యాక్సిన్లపై పశువైద్యాధికారి మహేంద్రబాబు వివరించారు. ఈకార్యక్రమంలో నెల్లూరు ఏవో జోత్స్నతోపాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వీఏఏలు పాల్గొన్నారు.