Abn logo
May 19 2020 @ 17:31PM

వలస కార్మికుల కోసం చెప్పులు, బూట్లు.. ఆగ్రా పోలీసుల ఔదార్యం

ఆగ్రా: వలస కార్మికులకు సాయం చేసేందుకు ఆగ్రా పోలీసులు నడుం బిగించారు. వలస కార్మికులకు ఆహారం, వసతి, చెప్పులు అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. దీనికోసం పలు చోట్ల ప్రత్యేక స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆయా స్టాళ్ల వద్ద వలస కార్మికులకు ఆహారం, తాగునీరు, చెప్పులు అందించి అండగా నిలుస్తున్నారు. దీనిపై అక్కడి పోలీసు అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఎంతోకొంత సాయం చేసేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు అనేకమంది వలస కార్మికులు వస్తుంటారని, వారందరికీ ఆహారం, తాగునీరు అందిస్తున్నామని, చెప్పులు లేని వారికి చెప్పులు, బూట్లు ఇస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement