ఏజెన్సీలో 45 ఏళ్లు నిండిన వారికి కరోనా టీకా

ABN , First Publish Date - 2021-04-13T05:12:18+05:30 IST

ఏజెన్సీలో 45ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య అన్నారు.

ఏజెన్సీలో 45 ఏళ్లు నిండిన వారికి కరోనా టీకా

  • ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య

రంపచోడవరం, ఏప్రిల్‌ 12: ఏజెన్సీలో 45ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య అన్నారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో వివిధశాఖల సెక్టారు అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా టీకా భయాన్ని పోగొట్టేలా ప్రతీ ప్రభుత్య ఉద్యోగి టీకా వేయించుకోవాలన్నారు. రంపచోడవరం ఏజెన్సీకి 8వేల కరోనా టీకాలు వచ్చాయన్నారు. ప్రతీ సోమవారం మండల స్థాయిలో తహశీల్దార్లు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో  సమన్వయ సమావేశం నిర్వహించి ఆయా మండలాల తాగునీరు, వైద్యం, విద్య, రేషన్‌, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్యలపై చర్చించాలని ఆదేశించారు. ఏటీడబ్ల్యువోలు పాఠశాలల్లో గుర్తించిన సమస్యలు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏజెన్సీ పరిధిలోని పీహెచ్‌సీలకు ఎన్ని కరోనా టీకాలు కావాలో ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని పీవో చెప్పారు. అలాగే గిరిజన సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన ఆశ్రమ పాఠశాలలతోపాటు జీపీఎస్‌, ఎంపీపీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతీ రెండు నెలలకొకసారి మెడికల్‌ చెకప్‌లు చేయించాలని, ప్రతి విద్యార్థికి జ్ఞానభూమి ద్వారా ఒక ఐడీ కార్డు లోగో ఏర్పాటు చేసి రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు.  ఆయా సమావేశాల్లో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T05:12:18+05:30 IST