రాత్రి చపాతీలు తిని పడుకున్నారు.. తెల్లారేసరికి ఆ కుటుంబంలో ఘోరం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-08-04T21:19:35+05:30 IST

ఆ కుటుంబ సభ్యులు ఐదుగురూ రాత్రి చపాతీలు తిని పడుక్కున్నారు..

రాత్రి చపాతీలు తిని పడుకున్నారు.. తెల్లారేసరికి ఆ కుటుంబంలో ఘోరం.. అసలేం జరిగిందంటే..

ఆ కుటుంబ సభ్యులు ఐదుగురూ రాత్రి చపాతీలు తిని పడుక్కున్నారు.. అయితే తెల్లారేసరికి ఘోరం జరిగింది.. మొత్తం ఐదుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.. దీంతో చుట్టుపక్కల వారు ఆంబులెన్స్‌ను రప్పించి బతికున్న వారిని హాస్పిటల్‌కు తరలించారు.. ఫుడ్ పాయిజనింగ్ జరగడం వల్లే అలా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఈ ఘటన జరిగింది.


కౌశాంబికి చెందిన రామ్‌లాల్ కుటుంబ సభ్యులు ఐదుగురూ సోమవారం రాత్రి చపాతీలు తిని నిద్రకు ఉపక్రమించారు. అయితే ఉదయం లేచే సరికి ఐదేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు బతికి ఉన్న ఇద్దరినీ హాస్పిటల్‌కు తరలించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. 


రామ్‌లాల్ ఇంటికి చేరుకున్న పోలీసులు పరిసరాలను గమనించారు. ఇంటి గోడలు, గచ్చుల నుంచి పురుగుల మందు వాసన రావడాన్ని గుర్తించారు. ఆ ఇంట్లో పురుగుల మందు స్ప్రే కూడా కనిపించింది. ఇంటి ముందున్న మొక్కలకు స్ప్రే కొడుతున్న సమయంలో ఆ ఇంట్లో కూడా పొరపాటున వ్యాపించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆహారంలో కూడా పురుగుల మందు పడడంతో దానిని తిన్న వారు చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు. 


Updated Date - 2021-08-04T21:19:35+05:30 IST