Abn logo
Apr 11 2021 @ 15:06PM

మేమొస్తే ఎన్నికల్లో హింసకు చరమగీతం: అమిత్‌షా

కోల్‌కతా: ఒక్క సీతల్‌కుచి (కూచ్ బెహర్) ఘటన మినహా పశ్చిమబెంగాల్‌లో ఇంతవరకూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే రాజకీయ, ఎన్నికల సంబంధిత హింసకు తావు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సందర్భంగా శాంతిపూర్‌లోని నడియా జిల్లాలో శనివారం జరిగిన రోడ్‌షోలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మమతా బెనర్జీ నలుగురు మృతులకు (కాల్పుల మృతులకు) మాత్రమే సంతాపం తెలుపుతున్నారని, ఐదో వ్యక్తి అయిన ఆనంద్ బర్మన్‌ కోసం ఒక్క కన్నీటి బొట్టు కూడా విడవడం లేదని అమిత్‌షా విమర్శించారు. ఆనంద్ బర్మన్ రాజ్‌వంశీ కులస్థుడు కావడమే కారణమని ఆయన అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు ఆనంద్ బర్మన్‌కు తెలియవన్నారు. ఆనంద్ బర్మన్ పేరు ప్రస్తావించని మమతాబెనర్జీ బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ తరహా రాజకీయాలు బెంగాల్ సంస్కృతి కాదని అమిత్‌షా పేర్కొన్నారు.

Advertisement
Advertisement