Advertisement
Advertisement
Abn logo
Advertisement

తల్లిని, భార్యను కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు.. నాలుగో రోజు ఉదయం అతని పరిస్థితి ఘోరం!

అతను ఓ తాగుబోతు.. రోజూ ఇంటికొచ్చి భార్యతోనూ, తల్లితోనూ గొడవపడుతుండేవాడు.. గత బుధవారం కూడా అలాగే చేశాడు.. విపరీతంగా తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవపడ్డాడు.. కూర బాగోలేదని ఆమెపై చేయి చేసుకున్నాడు.. అడ్డు వచ్చిన తల్లిని కూడా కొట్టాడు.. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.. మూడ్రోజుల వరకు ఇంటికి రాలేదు. నాలుగో రోజు ఉదయం అతని మృతదేహం చాలా భయంకరమైన స్థితిలో కనిపించింది.. రాజస్థాన్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


ఘజియాబాద్‌కు సమీపంలోని కౌశాంబి గ్రామానికి చెందిన రాజు రోజు కూలీగా పని చేస్తున్నాడు. రోజంతా పనిచేసి సాయంత్రం మద్యం సేవించడం అతని అలవాటు. ఎప్పటిలాగానే బుధవారం కూడా మద్యం సేవించిన రాజు ఇంటికి వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. ఆమె పెట్టిన కూర బాగోలేదని ఆమెపై చేయి చేసుకున్నాడు. అడ్డు వచ్చిన తల్లిని కూడా కొట్టాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి రాలేదు. ఎక్కడో నిద్రపోయి ఉంటాడని అతని భార్య ఊరుకుంది. తర్వాతి రోజు కూడా కనిపించకపోయే సరికి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. 


ఈ రోజు (శనివారం) ఉదయం అతని మృతదేహం మురికి కాలవలో లభ్యమైంది. అతని మొహాన్ని ఏదో జంతువు తినేసింది. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌ను బట్టి ఈ కేసులో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement