Advertisement
Advertisement
Abn logo
Advertisement

3 నెలల క్రితం పెళ్లి.. పక్కా ప్లానింగ్‌తో షాపింగ్‌కు వచ్చి భర్తకు భారీ షాకిచ్చిన నవ వధువు.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: మూడునెలల క్రితమే ఆమెకు పెళ్లైంది. రాఖీ పండగకు పుట్టింటికి వెళ్లింది. అక్కడ..  షాపింగ్‌కు వెళదామంటూ తల్లిని తీసుకుని మార్కెట్‌కు వెళ్లింది. తల్లిని ఓ షాపు వద్ద నిలబెట్టి..ఇప్పుడే వస్తానంటూ పక్క సందులోకి వెళ్లింది. అసలేం జరుగుతోందో తెలియని తల్లి..ఆమె కోసం ఎదురు చూడసాగింది. ఈలోపు.. భార్య పుట్టింటికి వెళ్లి చాలా రోజులవుతుండటంతో భర్త తన అత్తగారి ఇంటికి  ఫోన్ చేశాడు. భార్యను త్వరగా పంపించాలని కోరాడు. 

అల్లుడు ఫోన్ పెట్టేసిన కొద్ది సేపటికి..మార్కెట్ నుంచి కంగారుగా ఇంటికి తిరిగొచ్చిన అత్తాగారు.. తన కూతురు అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందని చెప్పడంతో ఇంట్లో వాళ్లందరూ ఒక్కసారిగా షాకయ్యారు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. బీహార్‌లోని బిహటా జిల్లాలో ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


ఈ మొత్తం వ్యవహారంలో సింటూ కుమార్ అనే యువకుడి ప్రమేయం ఉందని యువతి తల్లి పోలీసులకు తెలిపారు. గతంలో అతడు తన కూతురితో పలు మార్లు మాట్లాడటం చూశానని చెప్పారు. సింటూనే తన కూతురిని మభ్య పెట్టి తీసుకెళ్లిపోయాడని పేర్కొన్నారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement