IIFMలో ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-07-01T19:39:33+05:30 IST

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎఫ్‌ఎం) - ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. మొదటి రెండేళ్లు పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానాన్ని అనుసరిస్తారు. ఏడాదికి మూడు చొప్పున

IIFMలో ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎఫ్‌ఎం) - ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. మొదటి రెండేళ్లు పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానాన్ని అనుసరిస్తారు. ఏడాదికి మూడు చొప్పున రెండేళ్లకు ఆరు టర్మ్‌లు ఉంటాయి.  ప్రోగ్రామ్‌లో భాగంగా ఫారెస్ట్రీ, ఎన్విరాన్‌మెంట్‌, డెవల్‌పమెంట్‌ సంబంధిత మేనేజ్‌మెంట్‌ విధానాలపై క్లాస్‌ రూం తరగతులు నిర్వహిస్తారు. రెండో టర్మ్‌లో నాలుగు వారాల ఫీల్డ్‌ వర్క్‌, అయిదో టర్మ్‌లో కేస్‌ ప్రిపరేషన్‌, ఆరో టర్మ్‌లో థీసిస్‌ వర్క్‌ ఉంటాయి. మొదటి ఏడాది కోర్సుకు 20.75, రెండో ఏడాది కోర్సుకు 9 క్రెడిట్‌ యూనిట్స్‌ ఇస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో థీసిస్‌ వర్క్‌తోపాటు రిసెర్చ్‌/టీచింగ్‌ అసైన్‌మెంట్స్‌, సెమినార్‌లు, పబ్లికేషన్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌(రెండు), థీసిస్‌ సబ్మిషన్‌ ఉంటాయి. చివరి రెండేళ్లు పార్ట్‌టైం/ ఫుల్‌టైం జాబ్‌ చేసుకోవచ్చు. ఈ జాబ్‌ థీసిస్‌కు సంబంధించి ఉండకూడదు.  


స్పెషలైజేషన్‌లు

  • కమ్యూనికేషన్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌
  • ఎకో సిస్టం అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌
  • ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఎకనామిక్స్‌
  • ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌
  • హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌          
  • టెక్నికల్‌ ఫారెస్ట్రీ
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌    
  • మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌
  • సోషియాలజీ అండ్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌      
  • స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ/ మేనేజ్‌మెంట్‌/ ఎకనామిక్స్‌/ సోషల్‌ సైన్స్‌/ బయలాజికల్‌ సైన్స్‌/ ప్యూర్‌ సైన్స్‌/ కామర్స్‌/ హ్యుమానిటీస్‌/ ఫారెస్ట్రీ అండ్‌ రిలేటెడ్‌ సైన్స్‌/ ఎన్విరాన్‌మెంటల్‌ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు; కనీసం 55 శాతం మార్కులతో సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్‌ కోర్సులు పూర్తిచేసినవారు కూడా  దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి  45 ఏళ్లు మించకూడదు. రెండేళ్ల నాటి క్యాట్‌/ జీమ్యాట్‌ లేదా అయిదేళ్ల నాటి యూజీసీ నెట్‌/ సీఎ్‌సఐఆర్‌ నెట్‌/ జేఆర్‌ఎఫ్‌/ గేట్‌/ ఐసీఏఆర్‌ నెట్‌ పరీక్షల్లో అర్హత పొంది ఉండాలి. లేదంటే సంబంధిత రంగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి. ఐఐఎ్‌ఫఎం/ ఐఐఎం సంస్థల నుంచి పీజీడీఎ్‌ఫఎం/ పీజీడీఎం కోర్సులు పూర్తిచేసినవారు, నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు, పీహెచ్‌డీ ప్రవేశానికి నిర్వహించే ఎఫ్‌ఆర్‌ఐ ఎంట్రెన్స్‌ టెస్టు అర్హత పొందినవారు, ఆల్‌ ఇండియా అండ్‌ అలైడ్‌ సర్వీసుల్లో పనిచేసే ఆఫీసర్లు, జాతీయ బ్యాంకుల్లో పనిచేసే స్కేల్‌- 2 ఆఫీసర్లు, పీఎ్‌సయూలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక: జాతీయ పరీక్ష స్కోర్‌/ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ఇంటర్నల్‌ టెస్ట్‌కు పిలుస్తారు. ఇందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ విధానంలో రిసెర్చ్‌ ప్రపోజల్‌ ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.

ఫెలోషిప్‌: ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000; చివరి రెండేళ్లు నెలకు రూ.19,000 నగదు ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.35,000 ఇస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 26

వెబ్‌సైట్‌: www.iifm.ac.in/fpm

Updated Date - 2022-07-01T19:39:33+05:30 IST