ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో అదిరే అభి బృందం
ద్రాక్షారామ, జనవరి 16: జబర్దస్త్ నటుడు అదిరే అభి శనివారం ద్రాక్షారామ విచ్చేశారు. సంక్రాంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన భీమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట వైసీపీ నాయకుడు టేకుమూడి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.