ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో మొదలైన నాగోబా జాతర

ABN , First Publish Date - 2022-01-16T15:59:24+05:30 IST

ఆదిలాబాద్ జిల్లా: ఏజెన్సీలో నాగోబా జాతర సందడి మొదలైంది.

ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో మొదలైన నాగోబా జాతర

ఆదిలాబాద్ జిల్లా: ఏజెన్సీలో  నాగోబా జాతర సందడి మొదలైంది. తమ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఈ జాతరను గిరిజనులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా పుష్యమాసంలో ఈ జాతర కోలాహలం కనిపిస్తుంది. ఇప్పటికే కెస్లాపూర్‌లో నాగోబా జాతర కోసం గంగాజలం యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.


ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెళ్లి మండలం, కెస్లాపూర్‌లో నాగోబా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాగోబా దేవత మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం. మహా పూజ కోసం నిర్వహించే గంగా జలం తీసుకువచ్చేందుకు రావాలంటూ మెస్రం వంశస్తులు గ్రామంలో ప్రచారం చేస్తూ, రథంలో తిరుగుతూ వారం రోజులు ఆహ్వానిస్తారు. పుష్యమాసం అమావస్య రోజున గంగాజలంతో నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Updated Date - 2022-01-16T15:59:24+05:30 IST