అడ్డతీగల కళాశాల పేరు మార్పు

ABN , First Publish Date - 2020-08-15T18:43:13+05:30 IST

అడ్డతీగలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను అనంత చక్రరావు ప్రభుత్వ..

అడ్డతీగల కళాశాల పేరు మార్పు

రంపచోడవరం(తూర్పు గోదావరి): అడ్డతీగలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను అనంత చక్రరావు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా పేరు మార్చుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక కమిషనర్‌ చేసిన ప్రతిపాదనల మేరకు దాతలు చేసే తదుపరి ఆర్థిక సాయం రూ.50.56 లక్షల చెల్లింపు నిబంధనలకు లోబడి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. తక్షణం ఈ ఉత్తర్వులపై చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 


Updated Date - 2020-08-15T18:43:13+05:30 IST