కోరిక తీర్చలేదని.. కోపంతో ఆమెపై..

ABN , First Publish Date - 2020-07-29T15:41:53+05:30 IST

తన కోరిక తీర్చలేదన్న కక్షతో ఓ కామాంధుడు ఒక మహిళపై కత్తితో దాడి..

కోరిక తీర్చలేదని.. కోపంతో ఆమెపై..

కుప్పం(చిత్తూరు): తన కోరిక తీర్చలేదన్న కక్షతో ఓ కామాంధుడు ఒక మహిళపై  కత్తితో దాడి చేసిన ఘటన కుప్పం మండలం అడవిబూదుగూరులో మంగళవారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. అడవిబూదుగూరుకు చెందిన ఆనంద్‌ శనివారం రాత్రి ఓ మహిళ(38)పై అత్యాచారానికి యత్నించాడు. ఆమె నిరాకరించడంతో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మహిళ కేకలు పారిపోయాడు. మహిళను స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కుప్పం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-07-29T15:41:53+05:30 IST