ఆసుపత్రి పాలైన ప్రముఖ కమెడియన్

ABN , First Publish Date - 2021-04-16T21:59:08+05:30 IST

ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ వివేక్ అస్వస్థతతో శుక్రవారంనాడు ఆసుపత్రిలో ..

ఆసుపత్రి పాలైన ప్రముఖ కమెడియన్

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ వివేక్ అస్వస్థతతో శుక్రవారంనాడు ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడం, స్పృహతప్పిపడిపోవడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు సినీ,  ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చెన్నై ఆసుపత్రిలోని ఐసీయూలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. 59 ఏళ్ల వివేక్ ఈనెల 15న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.


పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన వివేక్ స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు. అగ్ర హీరోలైన రజనీకాంత్, విజయ్, అజిత్ కుమార్‌ తదితరుల చిత్రాల్లో నటించాను. రెండు చిత్రాల్లో లీడ్ రోల్ కూడా పోషించారు. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సామాజిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. 2012లో హిందీలో వచ్చిన 'విక్కీ డోనార్' తమిళ రీమేక్ అయిన "ధరల ప్రభు' అనే చిత్రంలో చివరిసారిగా వివేక్ కనిపించారు.

Updated Date - 2021-04-16T21:59:08+05:30 IST