Abn logo
Oct 11 2021 @ 07:51AM

Twitter: పాత సినిమా సన్నివేశంపై నెటిజన్ల అభ్యంతరకర వ్యాఖ్యలు..సినీనటి స్వరభాస్కర్ పోలీసులకు ఫిర్యాదు

న్యూఢిల్లీ : తన పాత సినిమా సన్నివేశంపై ట్విట్టరులో నెటిజన్లు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ప్రముఖ సినీనటి స్వరభాస్కర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పాత సినిమాలోని ఓ సన్నివేశంపై నెటిజన్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ సినీనటి స్వరభాస్కర్ ఢిల్లీలోని వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. 

అభ్యంతరకరమైన ట్వీట్లు పోస్టు చేసిన ట్విట్టరు ఖాతాలను తెలుసుకునేందుకు పోలీసులు ట్విట్టరును సంప్రదించారు.స్వరభాస్కర్ నిల్ బాతే, సన్నత, వీరే డి వెడ్డింగ్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. సామాజిక, రాజకీయ సమస్యలపై బహిరంగంగా మాట్లాడే స్వరభాస్కర్ తన చిత్రంపై నెటిజన్లు చేసిన ట్వీట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.ఈ కేసులో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. 


ఇవి కూడా చదవండిImage Caption