కడ్తా కథ కంచికి!

ABN , First Publish Date - 2021-06-23T05:24:46+05:30 IST

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో కడ్తా పేరిట జరిగిన దోపిడీపై ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు ఎ లాంటి చర్యలు తీసుకోలేదు.

కడ్తా కథ కంచికి!

యాసంగి ఽధాన్యం కొనుగోళ్లలో తీసిన తరుగుపై చర్యలు శూన్యం
రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన రైస్‌ మిల్లర్లు, సొసైటీల ప్రతినిధులు
ఆరోపణలు వచ్చిన మిల్లులు, సొసైటీలను పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
నామమాత్రపు చర్యలతో సరిపెట్టిన వైనం
జిల్లా రైతులు సుమారు రూ.4.5కోట్లు నష్టపోయినట్టు రైతు సంఘాల నేతల అంచనా

నిజామాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో కడ్తా పేరిట జరిగిన దోపిడీపై ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు ఎ లాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాకు చెందిన కొంతమంది రైస్‌ మిల్లర్లు, సొసైటీ చైర్మన్లు రాష్ట్రస్థాయిలో లాబీయింగ్‌ చే యడంతో ఆరోపణలు వచ్చిన మిల్లులు, సహకార సొసైటీల పై చర్యలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు కొంత మంది అధికారుల సహకార ంతో బయట పడ్డారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు తరుగు తీసినట్టు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేర కుఅధికారులు నామ మాత్రంగా విచారణ చేశారు. కొన్ని మిల్లులకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఒక సొసైటీ ఉద్యోగి పై చర్యలు తీసుకొని మమ అనిపించారు.
యాసంగిలో రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ
జిల్లాలో యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిం చారు. యాసంగిలో రైతులు జిల్లాలో 3.86 లక్షల ఎకరాలలో వరిని సాగు చేయగా దిగుబడి పెద్దఎత్తున వచ్చింది. జిల్లా యంత్రాంగం 438 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 1,04,037 మంది రైతుల నుంచి రూ.1,421 కోట్ల విలువైన 7 లక్షల 55 వేల 818 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు సేకరించింది. ఇప్పటి వరకు రూ.1,300 కో ట్లు సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేసింది.
గడిచిన కొన్నేళ్లుగా కడ్తా పేరిట దోపిడీ
జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా ధాన్యం సేకరణలో రైస్‌ మిల్ల ర్లు, కొన్ని సహకార సొసైటీల సిబ్బంది చేతులు కలుపుతు న్నారు. ధాన్యం సేకరణ సమయంలో నాణ్యత, మట్టి, చెత్త, తాలు పేరు తో తరుగు తీస్తున్నారు. ప్రతీ క్వింటాలుకు 3 కి లోల నుంచి 5 కిలోల వరకు అదనంగా తరుగు తీస్తున్నారు. యాసంగిలో కూ డా కడ్తా పేరిట తరుగు తీశారు. మొదట వారం నుంచి పది రోజుల పాటు నిబంధనల ప్రకారం ధా న్యం తూకం సమయంలో సంచి బరువు కింద కిలో వరకు తీసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. కరోనాతో కూ లీల కొరతను ఆసరాగా చేసుకొని 40 కిలోల బస్తాకు మరో కిలో జోడించి 42 కిలోల వరకు తూకం వేశారు. సొసైటీల లో నిబంధనల ప్రకారం తూకం వేసినా.. మిల్లులకు వెళ్లిన తర్వాత ధాన్యం నాసిరకంగా ఉందని లారీలను నిలిపివేశా రు. తప్పని పరిస్థితులలో రైతులు తరుగు తీసేందుకు ఒప్పు కోవడంతో వారికి భారీగా నష్టం వచ్చింది. కొనుగోలు కేంద్రా లలో ఇచ్చిన ట్రక్‌సీట్‌ లెక్కలకు.. మిల్లులకు ధాన్యం వెళ్లిన తర్వాత ఇచ్చిన పట్టీలకు భారీ తేడా వచ్చింది. దీంతో ప్రతీ రైతుకు వేల రూపాయల నష్టం వచ్చింది. జిల్లాలో జరిగిన కొనుగోళ్ల ఆధారంగా లెక్కలు తీయగా క్వింటాలుకు అదనం గా మూడు కిలోలు తరుగు తీస్తే 26 వేల 674 క్వింటాళ్ల వరకు రైస్‌ మిల్లర్లకు ధాన్యం అదనంగా వెళ్లింది. దీని విలు వ సుమారు రూ.4.5కోట్లు ఉంటుందని రైతు సంఘాల నేత లు అంచనా వేస్తున్నారు.
రైతుల ఫిర్యాదులు బుట్టదాఖలు
జిల్లాలో ధాన్యం సేకరణలో తీసిన తరుగుపై కొన్ని మిల్లు లు, సొసైటీలపై అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. త మకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాకు చెందిన కొంత మంది రైతు సంఘాల నేతలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మం త్రి నిరంజన్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చే శారు. జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో తరుగును ప్రో త్సహించిన మిల్లర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కో రారు. కానీ, ఆ ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి. నామమాత్రంగా కొన్ని మిల్లులకు నో టీసులను జారీ చేశారు. అరోప ణలు వచ్చిన సొసైటీలపై విచారణకు ఆదేశించారు. రెంజల్‌ పరిధిలోని ఓ సొసైటీ అధికారిని సస్పెండ్‌ చేశారు. అయితే, రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు చేయడం, జిల్లాలో వచ్చిన ఫిర్యా దులకు అనుగుణంగా అధికారులు విచారణకు సిద్ధం కావ డంతో కొంతమంది మిల్లర్లు, సొసైటీల చైర్మన్లు అప్రమత్తమ య్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లి అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారులను కలిశారు. తమకు సహక రించా లని కోరారు. ఈలోపు సీజన్‌ పూర్తికావడంతో వదిలివే యా లని కోరారు. తమకు అనూకూలంగా మద్దతు కూడగట్టా రు. అక్కడి నుంచి సమాచారం అందడంతో జిల్లాలో విచార ణను వాయిదా వేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్ర మే డబ్బులు చెల్లిస్తున్నారు. గత సీజన్‌ లాగానే ఈసారి కూ డా తరుగు వ్యవహారంలో ఎలాంటి చర్యలు ఉండే పరిస్థితులు లేవని కొంత మంది అధికారుల సమాచారం బట్టి తెలుస్తోంది. రైతులు మాత్రం భారీగా నష్టపోయారని రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. మొత్తంగా నేతలు సహకరించడంతో మిల్లర్లు, సొసైటీల ఉద్యోగులు బయటపడ్డారు.

Updated Date - 2021-06-23T05:24:46+05:30 IST