కంటైన్మెంట్‌ జోన్‌లో ముమ్మర చర్యలు

ABN , First Publish Date - 2020-05-23T10:43:29+05:30 IST

రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌కాలనీ వెంకటేశ్వరవీధికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో అధికారులు ఎస్‌ఎన్‌కాలనీలోని

కంటైన్మెంట్‌ జోన్‌లో ముమ్మర చర్యలు

రాయచోటిటౌన్‌, మే 22: రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌కాలనీ వెంకటేశ్వరవీధికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో అధికారులు ఎస్‌ఎన్‌కాలనీలోని కంటైన్మెంట్‌జోన్‌లో కరోనా నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా అర్బన్‌ సీఐ రాజు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌ల ఆధ్వర్యంలో బయట వ్యక్తులు ఎవ్వరూ ఆ ప్రాంతంలో సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. అలాగే మాజీ కౌన్సిలర్‌ దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలోమున్సిపల్‌ అధికారులతో పాటు వైద్యసిబ్బంది ఆ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్యం చర్యలు చేపట్టి, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 


Updated Date - 2020-05-23T10:43:29+05:30 IST