Abn logo
May 8 2021 @ 01:38AM

రెమ్‌డెసివిర్‌ పేరిట అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు

చిత్తూరు, మే 7:రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ పేరిట సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎం.హరినారాయ ణన్‌ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయక ఒక ప్రకటన విడుదల చేశారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ అతి తక్కువ ధరకే కలెక్టరేట్‌లో లభ్యమవు తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది నిజం కాదన్నారు. ఈ ఇంజెక్షన్‌ జిల్లాలోని ఆస్పత్రుల్లో మాత్రమే దొరుకుతుందని, వైద్యుల సూచన మేరకే వాటిని అందించడం జరుగుతుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వారిపై విచారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement