రైస్‌మిల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-13T05:07:25+05:30 IST

రైస్‌మిల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మోర్తాడ్‌లో ఆ యన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేం ద్రాలలో రైతులు విక్రయించిన ధాన్యినికి రైస్‌మిల్‌ యజమానులు దోపిడీ వెనుక అధికార యంత్రం ఉందని ఆరోపించారు. కేంద్రాల ద్వారా మద్దతు ధర పేరుతో రైతులు విక్రయించి లబ్దిపొందాలనుకుంటే రైస్‌మిల్‌ యజమానులు కడ్తాపేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.

రైస్‌మిల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

మోర్తాడ్‌, జూన్‌12: రైస్‌మిల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మోర్తాడ్‌లో ఆ యన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేం ద్రాలలో రైతులు విక్రయించిన ధాన్యినికి రైస్‌మిల్‌ యజమానులు దోపిడీ వెనుక అధికార యంత్రం ఉందని ఆరోపించారు. కేంద్రాల ద్వారా మద్దతు ధర పేరుతో రైతులు విక్రయించి లబ్దిపొందాలనుకుంటే రైస్‌మిల్‌ యజమానులు కడ్తాపేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని చెబుతూనే మరో పక్క రైస్‌మిల్‌ యజమానులు మోసం చేస్తుంటే అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు. విక్రయించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు కూ డా రావడం లేదన్నారు. తరుగు పేరుతో డబ్బులు తక్కువ చేసి రైతుల ఖాతాలో జమ చేస్తున్నారన్నారు. కేంద్రాలలో విక్రయిస్తే లాభం వస్తుందని ఆశించిన రైతుల కు నిరాశే మిగిలిందని అన్నారు. సమావేశంలో సునీల్‌సేన సభ్యులు నల్ల గణేష్‌గుప్తా, భాను, పాలెపు నర్సయ్య పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
బాల్కొండ: మండల కేంద్రంలోని పలు బాధిత కుటుంబాలకు బీఎస్పీ నాయ కుడు ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి శనివారం పరామర్శించారు. మండల కేంద్రాని కి చెందిన మెడికల్‌నరేందర్‌ తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆయన కు టుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యంతో మరణించిన మృతి చెందిన యువకు డు అరుణ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. బాల్కొండకు చెందిన మానస కంటి సంబంధిత సమస్యతో బాధపడుతుండగా ఆమెను పరామర్శించి రూ.5వేల ఆర్ధిక సహాయం అందజేశారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-06-13T05:07:25+05:30 IST