కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిందే..

ABN , First Publish Date - 2021-06-13T04:40:00+05:30 IST

బాన్సువాడలో మినీ ట్యాంక్‌బండ్‌ను నాసిరకంగా నిర్మి ంచిన కాంట్రాక్టర్‌, అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిందే..
బాన్సువాడలో ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

బాన్సువాడ, జూన్‌ 12: బాన్సువాడలో మినీ ట్యాంక్‌బండ్‌ను నాసిరకంగా నిర్మి ంచిన కాంట్రాక్టర్‌, అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు కట్టపై రూ.6.85 లక్షలతో నిర్మించిన మినీ ట్యాంక్‌బండ్‌ గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి కుం గిపోవడంతో నాణ్యతా లోపంతో నిర్మించిన కాంట్రాక్టర్‌, అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కాగా కల్కి చెరువు కట్టపై కుంగిపోయిన ప్రాంతాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భం గా జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌ను నాసిరకంగా నిర్మించడం వల్లనే కుంగిపోయిందని ఆరోపించారు. అందుకు కారణమైన కాంట్రా క్టర్‌, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేసింది. ఇప్పటికైనా మినీ ట్యాంక్‌బండ్‌ను నాణ్యతగా నిర్మించి, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలని వారు డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జీ మాల్యాద్రి రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

పరిశీలించిన రాష్ట్ర ఇరిగేషన్‌ సీడీవో సీఈ చంద్రశేఖర్‌

కల్కి చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన మినీ ట్యాంక్‌బండ్‌ కుంగిపోయిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ఇరిగేషన్‌ సీడీవో సీఈ చంద్రశేఖర్‌ శనివారం పరిశీలించారు. మినీ ట్యాంక్‌బండ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, టెక్నికల్‌ సమ స్యలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టి పూర్వ వైభవం తీసుకుని వస్తామని ఆయన తెలిపారు. మినీ ట్యాంక్‌బండ్‌ పనుల్లో ఎలాంటి నాణ్యత లోపించలేదని, కొంతమేర పాత చెరువు కట్ట నాణ్యతా లోపం ఉండటంతో పగుళ్లు వచ్చి చెరువు కట్ట కుంగిపోయేలా తయారైందన్నారు. ఎలాంటి ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. పూర్తిగా పరిశీలించి మరమ్మతులు చేపట్టి పూర్వ వైభవం తీసుకుని వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇరిగేషన్‌ సీఈ శ్రీనివాస్‌, టెక్నికల్‌ సీఈ శ్రీనివాస్‌, సొసైటీ చైర్మన్‌ ఎర్వల కృష్ణారెడ్డి, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ దుద్దాల అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాస్‌, పీఏ భగవాన్‌రెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు తదితరులున్నారు.

Updated Date - 2021-06-13T04:40:00+05:30 IST