‘సూపరింటెండెంట్‌, అవినీతి ఏడీపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2022-08-11T04:51:18+05:30 IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అసమర్థత సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి, అవినీతి ఏడీ రమే్‌షబాబులపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో డీఆర్వో నాగేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు.

‘సూపరింటెండెంట్‌, అవినీతి ఏడీపై చర్యలు తీసుకోవాలి’

కర్నూలు(కలెక్టరేట్‌), ఆగస్టు 10: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అసమర్థత సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి, అవినీతి ఏడీ రమే్‌షబాబులపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో డీఆర్వో నాగేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నగర కార్యదర్శి భీసన్న, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ కరోనా సమయంలో డా.నరేంద్రనాథ్‌ రెడి దొడ్డిదారిన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయాలుగా మారిందని విమర్శించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలకువేలు ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ మందుల కొరతతో బయట కొనాల్సిన  పరిస్థితి దాపురించిందని అన్నారు. రక్తపరీక్షలకు సంబంధించిన రసాయనాల కొరత రెండు వారాల నుంచి వేధిస్తున్నా సూపరింటెండెంట్‌ మొద్దునిద్రలో ఉన్నారని ధ్వజమెత్తారు. రేడియాలజీ డిపార్టుమెంట్‌లో టెక్నీషియన్ల కొరత, మిషన కొరత వల్ల క్షతగాత్రులు ఎక్స్‌రేల కొసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్‌, ఆసుపత్రి ఏడీ రమే్‌షబాబులు ఆసుపత్రిలో పని చేసే వివిధ ఏజెన్సీల నుంచి పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నిధులలో కూడా గోల్‌మాల్‌ జరిగిందని, విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-08-11T04:51:18+05:30 IST