ప్రక్షాళన ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-18T05:13:47+05:30 IST

మండల అభివృద్ధికోసం రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రక్షాళన చేపట్టారు.

ప్రక్షాళన ప్రారంభం
రఘునాథపాలెం మండల పరిషత్‌ కార్యాలయం

 పల్లె ప్రగతి పనులపై అలసత్వం వహించిన  ఎంపీడీవో, ఎంపీవోపై బదిలీ వేటు

 త్వరలో గ్రామకార్యదర్శుల మార్పు

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మంత్రి పువ్వాడ

రఘునాథపాలెం జూన్‌ 17: మండల అభివృద్ధికోసం రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రక్షాళన చేపట్టారు. పల్లెప్రగతి పై అలసత్వం వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలకు ఉపక్రమించారనే సమాచారం అటు అధికారుల్లో, అలసత్వం వహిస్తున్న ప్రజాప్రతినిధుల గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. అభివృద్ధి కోసం కోట్లు కేటాయిస్తున్న క్షేత్రస్థాయిలో తప్పిదాలపై మంత్రి మండిపడుతున్నారు. ఇప్పటికే రఘునాథపాలెంను అగ్రిహాబ్‌గా తీర్చిదిద్దిన మంత్రి, ప్రతి పల్లె పట్టణాలకు దీటుగా ఉండాలనే లక్ష్యంగా సీసీ రోడ్లు, డ్రెయిన్లు, లింక్‌ రోడ్లన్ని డబుల్‌రోడ్లుగా మార్చుతు ఇటీవలే సుమారు రూ.17కోట్లు విడుదల చేశారు. ప్రధాన గ్రామాలు సెంట్రల్‌ లైటింగ్‌లతో జిగేల్‌ మంటున్నాయి. కా ని పలుగ్రామాల అధికారులు, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించటంతో ఆగ్రహానికి గురైన మంత్రి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.


ఎంపీడీవో, ఎంపీవో బదిలీ


ప్రక్షాళలో భాగంగ రఘునాథపాలెంలో ఎంపీడీవో అశోక్‌కుమార్‌, ఎంపీవో శ్రీదేవిపై బదిలీ వేటు పడింది. ఎంపీడీవోను ఎర్రుపాలేనికి బదిలీ చేసి అక్కడ పనిచేస్తు న్న రామకృష్ణను రఘునాథపాలెం ఎంపీడీవోగా నియమిం చారు. అదేవింగా ఇక్కడ ఎంపీవోగా పనిచేస్తున్న శ్రీదేవిని కల్లూరుకు బదిలీ చేసి అక్కడ ఎంపీవోగా విధులు నిర్వర్తిస్తున్న శాస్ర్తిని రఘునాథపాలేనికి బదిలీ చేశారు.

అదేవిధంగ గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శుల పలువురిని స్థానచలనం చేసేవిదంగ చర్యలు చేపట్టే ఆస్కారం ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు. అభివృద్ది కార్యక్రమాలపై నిర్ణక్ష్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారుల్లో గుబులు మొదలైంది. 


అభివృద్ధే లక్ష్యంగా..


జిల్లా అభివృద్దే లక్ష్యంగ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అనునిత్యం శ్రమిస్తున్నారు. అందులో భాగంగ తన స్వంత నియోజకవర్గం రఘునాథపాలెం అభివృద్దిపై మరింత దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు మండలంలో అమలు అవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. కాని క్షేత్ర స్థాయిలో అధికారుల వైఫల్యాలను మంత్రి స్వయంగ పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని ఎక్కడ సమస్య ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించేదిశగా మంత్రి కృషిచేస్తున్నారు. కాని కొంత మంది అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వంతో మంత్రి ఆకాంక్ష అక్కడక్కడ విఫలం అవుతుందని మంత్రి దృష్టికి రవాటంతో ఆగ్రహానికి గురైయ్యారు. ఈక్రమంలో బుధవారం మంచుకొండ పర్యటించి కార్యదర్శి రాంకీని సస్పెండ్‌ చేసిన సంఘటన విదితమే...ఈక్రమంలో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారు లు పెండింగ్‌ పనులపై దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. 


Updated Date - 2021-06-18T05:13:47+05:30 IST