ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ రవీందర్ నుంచి లా పట్టా అందుకుంటున్న మాజీ మంత్రి చంద్రశేఖర్
వికారాబాద్, జనవరి 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ చేతుల మీదుగా గరువారం మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ న్యాయవాద పట్టా అందుకున్నారు. ఓయూలో వైస్ చాన్స్‌లర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.